ఆర్టీసీ అభివృద్ధిలో ఉద్యోగుల పాత్ర కీలకం
NZB: ఆర్టీసీ అభివృద్ధిలో ఉద్యోగుల పాత్ర కీలకమని రీజినల్ మేనేజర్ జ్యోత్స్న అన్నారు. నిజామాబాద్-1 డిపోలో శుక్రవారం ఉద్యోగులకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో భాగంగా ఆమె మాట్లాడుతూ.. క్రమశిక్షణ, సేవాభావం, సురక్షిత ప్రయాణం ఇవే సంస్థ బలాలని పేర్కొన్నారు. అవార్డులు కృషికి గుర్తింపు మాత్రమే కాదని.. ఇతరులకు ప్రేరణ అని తెలిపారు.