బస్టాండ్‌లో మర్యాద దినోత్సవం

NLG: ప్రయాణికుల ఆదరణ ఆర్టీసీ సంస్థకు మూలాధారమని ఉమ్మడి నల్గొండ రీజినల్ మేనేజర్ కే. జానిరెడ్డి అన్నారు. నల్గొండ బస్ స్టాండ్ లో కర్టసీ డే (మర్యాద దినోత్సవం) సందర్భంగా ఆర్టీసీ లోగో ఉన్న కీ చైన్ ప్రయాణికులకు బహుమతిగా అందించారు. డ్రైవర్లు, కండక్టర్లు ప్రయాణికులతో మర్యాదగా ప్రవర్తించి వారి ఆదరాభిమానాలు పొంది సంస్థకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు.