VIDEO: 'భూభారతి అవగాహన కార్యక్రమం విజయవంతం చేయాలి'

MDK: రామాయంపేట మండల కేంద్రంలో శుక్రవారం భూభారతి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తహసీల్దార్ రజనీకుమారి తెలిపారు. ఇవాళ ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూ సమస్యల పరిష్కారం కోసం భూభారతి తీసుకువచ్చిందని, భూభారతిపై రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.