ఆకునూరు అగ్ని ప్రమాదంపై మంత్రి జోగి రమేష్ దిగ్భ్రాంతి

కృష్ణా: ఉయ్యూరు మండలం ఆకునూరు గ్రామంలో ఆదివారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంపై రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి, పెనమలూరు నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త జోగి రమేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆకునూరు గ్రామంలోని వేస్ట్ మెటీరియల్ గోడౌన్‌లో అగ్ని ప్రమాదం సంభవించి మంటలు అదుపులోకి రావటం లేదని విషయాన్ని తెలుసుకున్న మంత్రి వెంటనే సంబంధిత అధికారులను అప్రమత్తం చేశారు.