ఘనంగా కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలు

NRPT: సీపీయస్ పాఠశాలలో కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు కళోజి జీవిత విశేషాలు, ఆయన రచనలు, సమాజంపై చూపిన ప్రభావం గురించి ప్రసంగించారు. హెడ్‌మాస్టర్ గురునాథ్ భాస్కర్ మాట్లాడుతూ.. కళోజి రచనలు ప్రజల్లో సామాజిక చైతన్యం రేకెత్తించాయని, విద్యార్థులు ఆయన ఆలోచనలను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.