VIDEO: CMRF చెక్కును పంపిణీ చేసిన ఎమ్మెల్యే
కృష్ణా: పెదపారుపూడి మండలం అప్పికట్ల గ్రామానికి చెందిన సాయల శేషమ్మకు రూ.30,028/- విలువ చేసే CMRF చెక్కును ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా చేతుల మీదుగా లబ్ధిదారుని ఇంటికి వెళ్లి సోమవారం అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అవసరమైన వారికి ప్రభుత్వం అందుబాటులో ఉన్న సంక్షేమ పథకాల ద్వారా అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.