'ఈ రోడ్డులో ప్రయాణం నరకం..మరమ్మత్తులు చేయండి'

'ఈ రోడ్డులో ప్రయాణం నరకం..మరమ్మత్తులు చేయండి'

CTR: కార్వేటినగరం మండలం గంగమాంబాపురం నుంచి దిగువ ముద్దికుప్పం వెళ్లే రోడ్డు అధ్వానంగా మారింది. రోడ్డు పూర్తిగా పాడవడంతో ఈ మార్గంలో వెళ్లే వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైతులు చక్కెర కర్మాగారానికి ఈ మార్గంలోనే చెరకును ట్రాక్టర్ల ద్వారా తరలిస్తుంటారు. రోడ్డు బురదమయమై నీరు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకుతీవ్ర అంతరాయం కలుగుతోంది.