సమీకృత వ్యవసాయ యూనిట్‌నుసందర్శించిన కలెక్టర్

సమీకృత వ్యవసాయ యూనిట్‌నుసందర్శించిన కలెక్టర్

BDK: లక్ష్మీదేవిపల్లిలోని లోతువాగు గ్రామంలో పడిగ అపర్ణ నిర్వహిస్తున్న సమీకృత వ్యవసాయ యూనిట్‌ను కలెక్టర్ జితేష్ వి. పాటిల్ బుధవారం సందర్శించారు. అవలంబిస్తున్న పద్ధతులు, మార్కెటింగ్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. కౌజు పిట్టలు, నాటు కోళ్లు, బాతులు, కొరమీను, మేకలు, కూరగాయలు, మునగ సాగు వివరాలపై ఆయన ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీవో విద్యచందన, తదితరులు పాల్గొన్నారు.