విజయవాడ లో గంజాయి స్వాధీనం

NTR: విజయవాడ బల్లెంవారి వీధిలో గంజాయి కలకలం రేపింది. పటమట పోలీసులు వివరాలు ప్రకారం.. కానూరు బల్లెంవారి వీధిలో గంజాయి విక్రయిస్తున్నారన్న స్థానికుల సమాచారం మేరకు శుక్రవారం మధ్యాహ్నం టాస్క్ ఫోర్స్ - పటమట పోలీసులు కలిపి సంయుక్తంగా దాడి చేశారు. ఈ దాడిలో నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని నాలుగు కేజీలు గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.