తీన్మార్ మల్లన్నకు వీఆర్‌ఏల కృతజ్ఞతలు!
NLG: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 3,700 మంది వీఆర్‌ఏలు సమస్యలను శాసనమండలిలో ప్రస్తావించినందుకు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను వీఆర్‌ఏల రాష్ట్ర నాయకత్వం కలిసి కృతజ్ఞతలు తెలిపింది. తమ హక్కులు, ఉద్యోగ భద్రత కోసం గళమెత్తినందుకు ధన్య వాదాలు తెలిపారు. సమస్యలు పరిష్కారమయ్యే వరకు తమ పోరాటానికి మద్దతుగా నిలవాలని కోరారు.