మోటార్ సైకిల్ చోరీ.. కేసు నమోదు

మోటార్ సైకిల్ చోరీ.. కేసు నమోదు

మంచిర్యాలలోని జిల్లా కోర్టు ఎదురుగా నిలిపిన సుజుకి మోటార్ సైకిల్ శనివారం చోరీకి గురైంది. స్థానిక చున్నంబట్టివాడకు చెందిన ముత్యం కమలాకర్ హెచ్‌పీ పెట్రోల్ బంక్ పక్కన హ్యాండిల్ లాక్ చేసి బైక్ నిలిపి కోర్టులోకి వెళ్లి తిరిగి వచ్చేసరికి కనిపించ లేదు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మజారుద్దీన్ తెలిపారు.