ఈనెల 18 వరకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్: కలెక్టర్

ఈనెల 18 వరకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్: కలెక్టర్

NRPT: జిల్లా వ్యాప్తంగా ఈనెల 18 వరకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిక్తా పట్నాయక్ శనివారం ప్రకటించారు. మొదటి, రెండవ విడత ఎన్నికలు పూర్తయిన గ్రామాలలో కూడా నిబంధనలు అమలులో ఉంటాయని తెలిపారు. తుదిదశ ఎన్నికలు పూర్తయ్యే వరకు ప్రతి గ్రామంలో ఎన్నికల నిబంధనలు పాటించాలని, ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.