దేవరగుట్టపై సీసీ కెమెరాల ఏర్పాటు

MBNR: నవాబుపేట మండలం యన్మన్ గండ్ల గ్రామ శివారులోని దేవరగుట్టపై చిరుత పులులు సంచరిస్తున్నాయన్న సమాచారంతో జిల్లా ఫారెస్ట్ అధికారులు ఆ ప్రాంతాన్ని సందర్శించారు. శుక్రవారం దేవరగుట్టపై సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అనంతరం ఆ ప్రాంతంలో చిరుత పులి పాదముద్రలను పరిశీలించారు. ఎవరూ కూడా ఆందోళన చెందవద్దని సూచించారు.