వాగు ఉధృతికి 2 గేదెలు మృతి.. రూ.4 లక్షలు నష్టం

వాగు ఉధృతికి 2 గేదెలు మృతి.. రూ.4 లక్షలు నష్టం

ప్రకాశం: తాళ్లూరు మండలంలోని దోర్నపు వాగు ఉద్ధృతికి రెండు గేదెలు మృత్యువాత పడ్డాయి. కొర్రపాటివారిపాలెంకు చెందిన గోనుగుంట బాబురావు తన పశువులను మేతకు తోలుకెళ్లాడు. దప్పికతో వాగులోకి దిగిన గేదలను వాగు ఉద్ధృతికి సుడి గుండంలో చిక్కుకుని మృతి చెందాయి. రెండు గేదెల విలువ రూ.4 లక్షల వరకు ఉంటుందని బాధిత రైతు తెలిపాడు.