కరెంట్ షాక్‌తో కేబుల్ ఆపరేటర్ మృతి
KMM: కారేపల్లి మండల కేంద్రానికి చెందిన టీవీ కేబుల్ ఆపరేటర్ జూపల్లి లాలయ్య (42) సోమవారం మధ్యాహ్నం ఇల్లెందు పట్టణంలో విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు. ఇల్లందు కరెంట్ ఆఫీస్ సమీపంలో విద్యుత్ స్తంభాలపై టీవీ కేబుల్ను లాగే క్రమంలో కరెంటు షాక్ తగలడంతో అక్కడికక్కడే కుప్పకూలాడు. మృతుడికి భార్య, నలుగురు కుమార్తెలు, కుమారుడు ఉన్నట్లు సమాచారం.