డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో నలుగురికి జరిమానా

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో నలుగురికి జరిమానా

సత్యసాయి: జిల్లాలో మద్యం సేవించి వాహనాలు నడిపిన నలుగురికి కోర్టు సోమవారం రూ.40 వేలు జరిమానా విధించింది. హిందూపురం రూరల్ పోలీసులు ఆదివారం రాత్రి తూముకుంట చెక్‌పోస్ట్ వద్ద తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో పట్టుబడిన నలుగురిని నేడు కోర్టులో హాజరుపరచగా, మెజిస్ట్రేట్ రమాదేవి ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున జరిమానా విధించారు.