ఎల్లంపల్లి ప్రాజెక్టు 10 గేట్లు ఎత్తివేత

MNCL: ఎగువ నుంచి భారీగా వరద నీరు వస్తుండడంతో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు 10 గేట్లను శనివారం సాయంత్రం అర మీటర్ మేర ఎత్తారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం148 మీటర్లు కాగా 146.63 మీటర్లకు, నీటి నిల్వ సామర్థ్యం 120.70 టీఎంసీలకు ప్రస్తుతం 16.4631 టీఎంసీలకు చేరింది. ప్రాజెక్టులోకి 90118 క్యూసెక్కుల నీరు చేరుతోంది.