రుచి కోసం తింటే.. ప్రాణానికే ముప్పు..!
RR: నగరంలో కల్తీ పదార్థాల విక్రయాలు ఆందోళన కలిగిస్తున్నాయి. అల్లం, పచ్చళ్లు, నెయ్యి, పాలు ఇలా ప్రతి వస్తువు కల్తీమయమై ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నాయి. సమయం లేక, బద్ధకంతో రెడీమేడ్ వస్తువులపై ఆధారపడటం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వీలైనంత వరకు ముడి సరుకులు తెచ్చుకుని ఇంట్లోనే స్వయంగా తయారు చేసుకోవడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.