డిసెంబర్ 13న జాతీయ లోక్ అదాలత్
VZM: స్థానిక జిల్లా కోర్టు ప్రాంగణంలో డిసెంబరు 13న జాతీయ లోక్ అదాలత్ జరుగుతుందని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి ఎ.కృష్ణ ప్రసాద్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ లోక్ అదాలత్‌లో వాహన ప్రమాదాలు, బ్యాంకులకు సంబంధించిన కేసులు, కాంపౌండబుల్ క్రిమినల్ కేసులు, ఎక్సైజ్ తదితర కేసులు పరిష్కరించుకోవచ్చని సూచించారు.