సంతమాగులూరులో సహకార సంఘాల కార్యాలయాలు మూత

సంతమాగులూరులో సహకార సంఘాల కార్యాలయాలు మూత

BPT: సంతమాగులూరు మండలంలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె ప్రభావంతో మంగళవారం ఏడు సహకార సంఘాల కార్యాలయాలు మూతపడ్డాయి. వేతనాలు, సేవా నిబంధనల అమలు, ఆపరేషనల్ గైడ్‌లైన్స్‌లో మార్పులు చేయాలని, 2019 తర్వాత నియమితులైన సిబ్బందిని రెగ్యులర్ చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగుతుందని తెలిపారు.