VIDEO: శ్రీపాద సంస్థానానికి రూ.కోటి విరాళం
KKD: దత్త జయంతి సందర్భంగా కాకినాడకు చెందిన దాత కుక్కుటేశ్వరరావు పిఠాపురం శ్రీపాద సంస్థానానికి భూరి విరాళం అందించారు. సంస్థానం వద్ద ఆయనకు ఉన్న 15 సెంట్ల స్థలంలో నిర్మించిన భారీ భవనానికి సంబంధించిన డాక్యుమెంట్లను గురువారం ఆలయ ఈవో ఆర్. సౌజన్యకు అందజేశారు. దేవుని పాదాల ముందు డాక్యుమెంట్లు పెట్టి పూజలు చేశారు. ఈ సందర్భంగా దాతన ఈవో ఘనంగా సత్కరించారు