'డంపింగ్ యార్డ్ పొగతో నానా ఇబ్బందులు'
RR: శంకర్పల్లి మున్సిపల్ పరిధిలోని MNR వెంచర్ పక్కన, డంపింగ్ యార్డ్‌లో చెత్తను తగలబెడుతుండడంతో, పక్కనే ఉన్న టీచర్స్ కాలనీ, పరిసర ప్రాంత కాలనీ ప్రజలు దట్టమైన పొగతో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజు పొగతో శ్వాసకోశ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. మున్సిపల్ అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.