డ్రైవింగ్ అనేది వృత్తి కాదు బాధ్యత: ఆర్ఎం
NZB: డ్రైవింగ్ అనేది వృత్తి కాదని.. అది ఒక బాధ్యత అని ఆర్టీసీ నిజామాబాద్ రీజినల్ మేనేజర్ జ్యోత్స్న అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆర్ఎం కార్యాలయంలో బుధవారం డ్రైవర్లు, కండక్టర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రాణాలు ఎంతో విలువైనవని, ఒక్క క్షణం నిర్లక్ష్యం ప్రాణ నష్టానికి దారితీస్తుందన్నారు.