‘MLAలు గుర్తించిన పనులు, ప్రాజెక్టులపై నివేదికలు సమర్పించాలి’
VZM: నియోజకవర్గాల్లో MLAలు గుర్తించిన పనులు, ప్రాజెక్టులపై శాఖల వారీగా నివేదికలు సమర్పించాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి అధికారులకు ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. ఆయా పనులకయ్యే ఖర్చు, లబ్ధి పొందే ప్రజల వివరాలతో పాటు ఇప్పటికే మంజూరై నిధులు రాని పనుల వివరాలను కూడా సమర్పించాలని సూచించారు.