మావోయిస్టుల అరెస్ట్.. వెలుగులోకి కీలక విషయాలు
AP: ఏలూరులో 15 మంది మావోయిస్టుల అరెస్టు అంశంలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అక్టోబర్ 26న మావోలు ఇల్లు అద్దెకు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కేబుల్ పని చేస్తున్నామని నెలకు రూ.10 వేల చొప్పున ఇల్లు అద్దెకు తీసుకున్నారని.. ఇద్దరు మాత్రమే బయట నుంచి ఆహారం తీసుకొచ్చేవారని వెల్లడించారు. ఈ క్రమంలో మరిన్ని వివరాల కోసం ఇంటి యజమానిని ప్రశ్నిస్తున్నారు.