నేడు విద్యుత్ సమస్యలపై ప్రజావాణి

నేడు విద్యుత్ సమస్యలపై ప్రజావాణి

ADB: విద్యుత్తు వినియోగదారుల సౌలభ్యం కోసం నిర్మల్ లోని సర్కిల్ కార్యాలయం ఆవరణలో బుధవారం ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఆ శాఖ ఎఈ  బి. శ్రీనివాస్ తెలిపారు. సమస్యలపై ఫిర్యాదులు స్వీకరించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. కావున వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.