తెలంగాణ క్రికెట్ క్రీడాకారులకు హెచ్‌సీఏ అన్యాయం చేస్తుంది

ADB: తెలంగాణ క్రికెట్ క్రీడాకారులకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అన్యాయం చేస్తోందని టీసీఏ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు పైడిమల నర్సింగ్ ఆరోపించారు. గురువారం మందమర్రి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సుప్రీంకోర్టు తీర్పుతో పాటు బీసీసీఐ ఆదేశాలను దిక్కరిస్తోందన్నారు. సంపన్నుల పిల్లల వద్ద పెద్ద డబ్బులు వసూలు చేస్తున్నారు.