పాముకాటుతో వృద్ధురాలు మృతి

BHPL: పట్టణ కేంద్రంలోని నాగారం గ్రామానికి చెందిన కన్నెబోయిన పెద్ద లక్ష్మి (70) పాముకాటు వేయడంతో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్లు సీఐ నరేష్ కుమార్ తెలిపారు. ఇంట్లో భోజనం చేస్తుండగా కాలికి పాముకాటు వేయడంతో ఆమెను వంద పడకల ఆసుపత్రికి తరలించారు. ఆమె మృతితో కొడుకు విజేందర్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.