సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేసిన ఎమ్మెల్యే
ELR: పెదవేగి మండలం పినకడిమిలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకరరావు ఆదివారం పర్యటించారు. పాముకాటుతో అనారోగ్యానికి గురైన పామర్తి ఝాన్సీ రాణిని పరామర్శించి సీఎం రిలీఫ్ ఫండ్ 1,50,000 రూపాయల చెక్కు అందజేశారు. కాలనీ రోడ్లను పరిశీలించి శుభ్రత లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. రోడ్లు, డ్రైన్లు శుభ్రంగా ఉంచేలా అధికారులు చర్యలు చేపట్టాలని అన్నారు.