రూ.2.50 లక్షల సీఎంఆర్‌ఎఫ్ సాయం

రూ.2.50 లక్షల సీఎంఆర్‌ఎఫ్ సాయం

KMR: ఎల్లారెడ్డి మండల కేంద్రానికి చెందిన మొహమ్మద్ ఇమ్రాన్‌కు అనారోగ్య చికిత్స నిమిత్తం ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు చొరవతో రూ.2,50,000 ముఖ్యమంత్రి సహాయ నిధి మంజూరైంది. శుక్రవారం ఈ ఆర్థిక సాయానికి సంబంధించిన పత్రాలను అందజేశారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న తమకు ఈ సాయం ఎంతో ఊరటనిచ్చిందని ఇమ్రాన్ కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.