మర్రిపాడుకు వచ్చిన సైకిల్ యాత్రికులు

మర్రిపాడుకు వచ్చిన సైకిల్ యాత్రికులు

NLR: రాజస్థాన్‌కు చెందిన ఇద్దరు యువకులు దేశ సైకిల్ యాత్రకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా వారు గురువారం మర్రిపాడు నుంచి ఏపీలిగుంట మీదుగా 565 జాతీయ రహదారిపై వెళుతూ కనిపించారు. వారిని స్థానికులు పలకరించగా.. ఇప్పటి వరకు 12 రాష్ట్రాల్లో తమ సైకిల్ యాత్ర చేపట్టినట్లు తెలిపారు. జాతీయ జెండాలతో ఈ సైకిల్ యాత్ర చేపట్టిన వారిని స్థానికులు అభినందించారు.