జిల్లా అభివృద్ధికి 10 సూత్రాలు కీలకం: కలెక్టర్
స్వర్ణాంధ్ర విజన్-2047లో భాగంగా రూపొందించిన 10 సూత్రాలు కర్నూలు జిల్లా అభివృద్ధికి అత్యంత కీలకమని కలెక్టర్ డా. ఏ. సిరి తెలిపారు. ఇవాళ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో జీరో పావర్టీ, మానవ వనరుల అభివృద్ధి, తదితర అంశాల అమలు పురోగతిపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. 'జలధార-జలహారతి' కార్యక్రమం ద్వారా ప్రతి చుక్క నీటిని భూగర్భంలోకి చేరేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.