'విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడటం సరికాదు'
JGL: విద్యార్థుల భవిష్యత్తుతో నాయకులు చెలగాటమాడటం సరికాదని బీజేపీ రాష్ట్ర నాయకురాలు భోగ శ్రావణి అన్నారు. జగిత్యాలలో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. జిల్లాకు మంజూరైన కేంద్రీయ విశ్వవిద్యాలయానికి ఎందుకు స్థలం కేటాయించడం లేదని ప్రశ్నించారు. స్థలం కేటాయింపు విషయంలో జిల్లా మంత్రి జోక్యం చేసుకోకపోవడం విచారకరమన్నారు.