గ్రామ అభివృద్ధికి కూటమి కృషి: ఎమ్మెల్యే ధర్మరాజు
ELR: దేశానికి పట్టుకొమ్మలైన గ్రామాల అభివృద్ధికి NDA కూటమి ప్రభుత్వం విశేష కృషి చేస్తోందని ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు అన్నారు. నిడమర్రు మండలం చానమిల్లిలో రూ.20 లక్షలతో నూతన పైన్లైన్, రూ.9.50 లక్షలతో సీసీ రోడ్లు, రూ.13.50 లక్షలతో ఎల్లమ్మ చెరువు కల్వర్టును గురువారం రాత్రి ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.