అత్యవసరమైతే సంప్రదించండి: SP

SRD: రాబోయే 72 గంటలు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినట్లు ఎస్పి పరితోష్ పంకజ్ మంగళవారం తెలిపారు. అత్యవసరం అయితే 100, 8712656739 నెంబర్లకు ఫోన్ చేయాలని పేర్కొన్నారు. ఫోన్ చేస్తే వెంటనే సహాయక చర్యలు చేపడతారని చెప్పారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించాలని సూచించారు.