ఇంటి పన్ను చెల్లించిన మున్సిపల్ ఛైర్ పర్సన్
MLG: 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను ముందస్తుగా ఆస్తి పన్ను చెల్లించిన వారికి 5% రాయితీ కల్పించనున్నట్లు ములుగు మున్సిపల్ ఛైర్ పర్సన్ చంద్రకళ తెలిపారు. ఈక్రమంలో ఆమె తన ఇంటికి సంబంధించిన ట్యాక్స్‌ను చెల్లించారు. మున్సిపాలిటీ పరిధిలోని అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ములుగు అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు.