ఏడాదిగా పాడైన తాగునీటి బోరు
ASR: డుంబ్రిగూడ రైతు సేవా కేంద్రం వెనకాల ఉన్న తాగునీటి బోరు సుమారు సంవత్సరం కాలంగా పాడైపోయి వినియోగానికి పనికిరాకుండా ఉంది. దీంతో ఆ వీధి వాసులకు తాగునీటి సమస్య ఏర్పడింది. పలు మార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటివరకు మరమ్మతులు చేపట్టలేదని స్థానికులు వాపోతున్నారు. వేసవి సమీపిస్తున్న నేపథ్యంలో తాగునీటి అవసరం మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు.