ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ నిబంధనను రద్దు చేయాలని వినతి
KDP: 2, 3 దశాబ్దాలుగా పనిచేస్తున్న ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ తప్పనిసరి నిబంధనను రద్దు చేయాలని బద్వేలు MLA డి. సుధను మంగళవారం STU నాయకులు కలిసి కోరారు. టెట్ ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు భారంగా మారిందని, 2009 తర్వాత నియామకమైన వారికి టెట్ అవసరం లేదని, సీనియర్ ఉపాధ్యాయులను వారి సబ్జెక్టు కాకుండా ఇతర సిలబస్‌తో టెట్ రాయమనడం సమంజసం కాదని వారు కోరారు.