డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు
ASF: రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసుల ఆధ్వర్యంలో 'అరైవ్-అలైవ్’ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఆసిఫాబాద్ పట్టణంలోని ఆటో, ట్రాలీ డ్రైవర్లకు ఉచితంగా కంటి పరీక్షలు చేయించారు. ASP చిత్తరంజన్ మాట్లాడుతూ.. అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం ప్రాణాంతకమన్నారు. మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని, ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ ప్రమాదాల నివారణకు సహకరించాలన్నారు.