రాత్రికి రాత్రే మారిన గుర్తులు
SRCL: సర్పంచ్ అభ్యర్థికి కేటాయించిన గుర్తును రాత్రికి రాత్రే మార్చడంతో తంగళ్ళపల్లిలో కలకలం రేగింది. BRS మద్దతుతో పోటీలో నిలిచిన రవీందర్‌కు తొలుత ఉంగరం గుర్తుని కేటాయించారు. అయితే అనూహ్యంగా గుర్తులు మారుస్తూ.. ఆయనకు మొదట ప్రకటించిన ఉంగరం గుర్తు స్థానంలో కత్తెర గుర్తును కేటాయించగా, అధికార పార్టీ నాయకులు కావాలనే గుర్తులు మారుస్తున్నారని BRS నాయకులు ఆరోపిస్తున్నారు.