విద్యుత్ షాక్.. బాలుడికి తీవ్ర గాయాలు

విద్యుత్ షాక్.. బాలుడికి తీవ్ర గాయాలు

W.G: ఆకివీడు రైల్వేక్వార్టర్స్ సమీపంలో వాలీబాల్ ఆడుకుంటున్న ఐదవ తరగతి బాలుడు నమ్మి హర్ష ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురైనట్లు స్థానికులు తెలిపారు. వాలీబాల్ ట్రాన్సఫార్మర్ పై పడటంతో దానిని తీసుకోవడానికి వెళ్లి పట్టుకోవడంతో ఈ ఘటన జరిగింది. విద్యుత్ షాక్తో కాలిన గాయాలైన హర్షను చికిత్స నిమిత్తం వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.