హైడ్రా కమిషనర్‌పై ఫిర్యాదు.. స్పీకర్ చర్యలు

హైడ్రా కమిషనర్‌పై ఫిర్యాదు.. స్పీకర్ చర్యలు

TG: వారంలోపు కూకట్‌పల్లి నల్లచెరువు శిలాఫలకాన్ని మార్చాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను స్పీకర్ గడ్డం ప్రసాద్ ఆదేశించారు. ప్రొటోకాల్ ప్రకారం MLCలు శంభీపూర్ రాజు, వాణిదేవి పేర్లతో కొత్తది పెట్టాలని స్పష్టంచేశారు. కాగా స్థానిక ప్రజాప్రతినిధుల పేర్లకు బదులు కాంగ్రెస్ నేత బండి రమేష్ పేరు ఉండటంపై BRS MLA మాధవరం కృష్ణారావు స్పీకర్‌కి ఫిర్యాదు చేశారు.