మహిళా పోలీసుల భారీ సైకిల్ ర్యాలీ
అనంతపురం నగరంలో శనివారం మహిళా పోలీసులు భారీ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. మహిళా భద్రత, సాధికారతపై చైతన్యం కల్పించేందుకు పోలీస్ హెడ్‌క్వార్టర్స్ నుంచి ఎన్టీఆర్ సర్కిల్ వరకు ఈ కార్యక్రమం సాగింది. మహిళలపై నేరాల నిరోధానికి పోలీస్ శాఖ కట్టుబడి ఉందని, అపదలో ఉన్నవారు శక్తి టీమ్స్ సేవలు వినియోగించుకోవాలని ఉన్నతాధికారులు సూచించారు.