రూ. 90 కోట్లతో ప్రతి ఇంటికి తాగునీరు: ఎమ్మెల్యే పరిటాల
ATP: ఆత్మకూరులోని సచివాలయం-2లో మండల స్థాయి అధికారులతో జరిగిన సమావేశంలో MLA పరిటాల సునీత పాల్గొన్నారు. రూ.90 కోట్లతో గ్రామీణ నీటి సరఫరా శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ఇంటింటికీ కుళాయి పనుల పురోగతిపై ఆమె ఆరా తీశారు. ఇల్లు లేని ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకునేందుకు గడువు పెంచాలని, ఇళ్ల నిర్మాణ ఖర్చును పెంచాలని ప్రభుత్వాన్ని కోరతామని హామీ ఇచ్చారు.