HYDలో భారీగా స్థిరాస్తి విక్రయాలు
HYD: గ్రేటర్ HYDలో ఈ ఏడాది జూలై నుంచి సెప్టెంబర్ నాటికి 17,658 స్థిరాస్తులు విక్రయించినట్లుగా స్థిరాస్తి కన్సల్టెంట్ ప్రాప్ టైగర్ వెల్లడించింది. గత సంవత్సరం ఇదే కాలంలో జరిగిన విక్రయాలతో పోలిస్తే 53 శాతం ఎక్కువ అని వెల్లడించింది. హైదరాబాద్ తర్వాత గిరాకి అధికంగా ఉన్న నగరాల్లో బెంగళూరు, చెన్నై ఉన్నట్లు పేర్కొంది.