అక్రమంగా గోవులను తరలిస్తున్న వాహనం సీజ్
విశాఖలో అక్రమంగా గోవులను తరలిస్తున్న వాహనాన్ని పీఎంపాలెం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. శుక్రవారం కారు షెడ్డు కూడలి వద్ద తనిఖీలు చేపడుతుండగా ఈ వాహనం పట్టుబడిందన్నారు. డ్రైవర్‌ని ప్రశ్నించగా పొంతన లేని సమాధానం చెప్పడంతో వాహనాన్ని స్థానిక స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనకి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.