పాత కిడ్నాప్ కేసులో నిందితుడి అరెస్ట్
సత్యసాయి: తనకల్లు పోలీస్ స్టేషన్ పరిధిలోని పాత కిడ్నాప్ కేసులో పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు రమేష్ అలియాస్ బిల్లాను పోలీసులు అరెస్ట్ చేశారు. 2019లో బాధితులను అపహరించి రూ.3 లక్షలు డిమాండ్ చేసిన కేసులో ఇతడు నిందితుడు. కర్ణాటకలోని చింతామణిలో ఉన్నాడనే సమాచారం నుంచి ప్రత్యేక బృందం ఇతడిని పట్టుకుంది. అనంతరం పోలీసులు నిందితుడిని జైలుకు తరలించారు.