కోటగుళ్లలో ఘనంగా నాగుల పంచమి వేడుకలు

BHPL: కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్లలో మంగళవారం నాగుల పంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని నాగదేవుని పుట్ట వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు జూలపల్లి నాగరాజు నాగేంద్ర స్వామికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించగా, మహిళలు పుట్టలో పాలు పోసి నాగదేవుని ఆలయ ప్రాంగణంలో దీపాలను వెలిగించారు.