ప్రజా వ్యతిరేక విధానాలపై సీపీఐ పోరాటం: భీమారావు

W.G: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా రాబోయే మూడేళ్లలో సీపీఐ చేపట్టబోయే కార్యాచరణపై సీపీఐ జిల్లా మహాసభల్లో తీర్మానం చేయనున్నట్లు జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈనెల 19, 20 తేదీల్లో తణుకులో జరగనున్న సీపీఐ 27వ జిల్లా మహాసభలకు రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ పాల్గొంటారన్నారు.