VIDEO: కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి

VIDEO: కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి

ములుగు: జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డులో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని సోమవారం మంత్రి సీతక్క ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతులు దళారులను ఆశ్రయించి మోసపోవద్దని, మార్కెట్‌ ద్వారా మొక్కజొన్నను అమ్మాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ ఛైర్మన్ రేగా కళ్యాణి, జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ భానోత్ రవి చందర్, తదితరులు పాల్గొన్నారు.